పర్యావరణాన్ని రక్షించుకోకపోతే మనిషి మనుగడ కష్టమవుతోందని జీఎస్టీ అడిషనల్ డైరక్టర్ జనరల్ రహమాన్ అభిప్రాయపడ్డారు. విజయవాడ పిలాంత్రఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ రక్షణ చేపట్టే వ్యాపారస్తులకు జీఎస్టీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని రహమాన్ తెలిపారు. ఈకో జీఎస్టీ అమలుతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు. ప్రకృతి పరిరక్షణకు కృషిచేస్తోన్నవారికి పర్యావరణ్ మిత్ర అవార్డులను అందచేశారు. కాలుష్యం కారణంగా కొన్ని జీవరాశులు తమ ఉనికిని కోల్పోతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం, అడవుల సంరక్షణ వంటి చర్యలు అందరూ చేపట్టాలని నిపుణులు కోరారు.
ఇవీ చూడండి : ఎవరీ.. నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి సుచరిత!