కర్నూలు జిల్లా నంద్యాలో భారీ చోరీ జరిగింది. స్థానిక ఫరూక్ నగర్లో నంద్యాల ఉప తహసీల్దారు రమాదేవి నివాసముంటున్న ఇంట్లో దొంగలు ప్రవేశించారు. సమీప బంధువు చనిపోవడంతో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారు, రెండు కిలోల వెండి, రెండున్నర లక్షల నగదు అపహరించుకుని వెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి విచారణ చేపట్టారు. చోరీ చేసిన ప్రదేశంలో దొంగలు కారం పొడి చల్లారు.
తాళం వేసిన ఇంటిపై కన్నేశారు..భారీగా దోచేశారు! - latest news of huge theft in nandyala
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ చోరీ జరిగింది. నంద్యాల ఉప తహసీల్దారు రమాదేవి సమీప బంధువు చనిపోవటంతో ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.