Huge influx from YCP to TDP: విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోండ్రు మురళీమోహన్ సమక్షంలో 200 కుటుంబాలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. రాజాం పట్టణం తెలగావీధికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు నంది సూర్యప్రకాష్, బానిశెట్టి వెంకట్రావు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొండ్రు మురళీమోహన్ టీడీపీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.
వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి శూన్యం..: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా రాజాం పట్టణం కనీస అభివృద్ధి నోచుకోలేదని, వైఎస్సార్సీపీ నిరంకుశ వైఖరికి నిరసనగా టీడీపీలో చేరామని పార్టీలో చేరిన పలువురు యువకులు, మహిళలు తెలిపారు. రాజాంలో పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకూ ర్యాలీగా వచ్చి టీడీపీలో చేరారు.
నిత్యావసర సరుకుల ధరల పెరిగాయి..: అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కోండ్రు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర సరుకుల ధరల పెరిగాయన్నారు. రాష్ట్రంలో పూర్తిగా మహిళలకు రక్షణే కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు, తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకూ మహిళలు, యువతీ యువకులు చేరికలు శుభ పరిణామం అని అన్నారు.
టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం..: రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించు కుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కోండ్రు ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి