ARMY CANDADATES AREEST: తిరుపతి రైల్వేస్టేషన్‌ను టార్గెట్ చేయాలనే లక్ష్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరు ఆర్మీ అభ్యర్థులను తిరుపతి జిల్లా యర్రావారిపాళెం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అగ్నిపథ్ పథకానికి నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే విధ్వంసం జరిగే ముందురోజే కొంతమంది యువకులు రైల్వే స్టేషన్ బ్లాక్, ఆర్మీ 17/6 అనే రెండు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు కనుగొన్నట్లు తెలుస్తోంది.
ఈ గ్రూపులలో విధ్వంస రచన ఎలా చేయాలో దిశానిర్దేశం చేసుకున్నట్లు నిఘా వర్గాలు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగా యర్రావారిపాళెం మండలంలోని పెద్దనాయినిపల్లికి చెందిన రాజేష్, రూపేష్ అనే యువకులు ఆయా గ్రూపుల్లో సభ్యులుగా ఉండడంతో పాటు తిరుపతి రైల్వేస్టేషన్‌ను లక్ష్యంగా చేసుకోవాలనే పోస్టులు చేసినట్లు నిఘావర్గాలు కనుగొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సైబర్ నిఘా వర్గాలు వీరి కదలికలను కనుగొన్నాయి. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక పోలీసులు శనివారం రాత్రి వీరిద్దరిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి:
- 'అయ్యన్నపాత్రుడి గొంతు నొక్కేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'
- HIGH SECURITY: రాష్ట్రంలోనూ అలజడికి వ్యూహం? పోలీసుల అదుపులో 45 మంది అనుమానితులు