ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు వెండి అంబారి ఉత్సవం - శ్రీకాళహస్తీశ్వరాలయం

Vendi Ambari Utsav At Srikalahastiswara temple : తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. సోమవారం భక్త కన్నప్ప ధ్వజారోహణముతో మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో శ్రీకాళహస్తి దివ్య కైలాసంగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఘనంగా వెండి అంబారీ ఉత్సవం నిర్వహించారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం
శ్రీకాళహస్తీశ్వర ఆలయం
author img

By

Published : Feb 14, 2023, 2:13 PM IST

Vendi Ambari Utsav At Srikalahastiswara temple : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన దాతలు మల్లాది బాలసుబ్రమణ్యం, మల్లాది నాగేశ్వరరావు దంపతులు వెండి అంబారీలను వితరణగా అందజేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు అనుకూలంగా రూ.1.36 కోట్ల విలువైన వెండి అంబారీలను ఆలయానికి అందజేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంబారులకు పూజలు చేపట్టారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఘనంగా వెండి అంబారీ ఉత్సవం నిర్వహించారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు వెండి అంబారి ఉత్సవం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఘనంగా వెండి అంబారీ ఉత్సవం నిర్వహించారు. సోమ స్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంభికా దేవి అమ్మవారు వెండి అంబారీలపై కొలువుదీరి మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. ఉత్సవర్లు ముందు నంది ధ్వజపటాలం, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఆది దంపతులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ముందుకు సాగారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు, భజనలు కోలాటాలతో భక్తి భవాని చాటిచెప్పారు. మధ్యాహ్నం ఆలయంలో స్వామి అమ్మవారుల ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా దైవ దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని.. ఆలయ పాలక మండలి, అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.