తిరుపతి జిల్లాలో అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులను ఎస్పీ పరమేశ్వరరెడ్డి సస్పెండ్ చేశారు. రూ.20 లక్షల విలువైన సిగరెట్ల మాయంలో ప్రమేయం ఉందని తేలడంతో తిరుచానూరు సీఐ సుబ్రమణ్యం, ఎస్సైలు వీరేష్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డిపై వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గోదాం నుంచి సిగరెట్లు పోయాయని ఐటీసీ మేనేజర్ ఫిర్యాదుతో ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణకు ఆదేశించారు. సిగరెట్ ప్యాకెట్లు పక్కదారి పట్టించడానికి సదరు అధికారులు సహకరించినట్లు విచారణలో తేలింది. రూ.20 లక్షల విలువైన సిగరెట్ల మాయం కేసులో అధికారుల ప్రమేయం తేలడంతో చర్యలకు ఎస్పీ ఉపక్రమించారు.
ఇవీ చదవండి: 'అగ్నిపథ్'కు దరఖాస్తుల వెల్లువ.. 6 రోజుల్లోనే 1.83 లక్షలు