నాటుబాంబు పేలి గేదె మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా కెవిబిపురం మండలంలో చోటు చేసుకుంది. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కోటేశ్వరి, రామచంద్రయ్య దంపతుల ఇంటి బయట బాంబు పేలడం కలకలం రేపింది. ఇంటి బయట పశువుల పాకలో ఉన్న గేదె గడ్డి తింటుండగా పేలుడు సంభవించింది. భారీ శబ్ధం రావటంతో టపాసులు పేలాయని భావించిన కోటేశ్వరమ్మ.. ఇంటి బయటకు వచ్చారు. పశువుల పాకలో పొగ రావటంతో పాటు గేదె కింద పడిపోయి ఉండటంతో తన భర్త రామచంద్రయ్యకు సమాచారం ఇచ్చారు. పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించడంతో.. పేలని మరో నాలుగు నాటు బాంబులు లభ్యమయ్యాయి. పేలని బాంబులను నీటితో నింపిన డబ్బాలో వేసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు లక్ష రూపాయల విలువ చేసే గేదె మృతి చెందడంతో కోటేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: