Nara Lokesh sensational comments on Minister Peddireddy: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేడు (33వ రోజు) పుంగనూరుకు చేరుకుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు 'సెల్ఫీ విత్ లోకేశ్' కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సాధారణ కార్యకర్తల్లా మాజీ మంత్రి అమరన్నాథ్ రెడ్డి, సీనియర్ నేత పయ్యావుల కేశవ్‍లు క్యూ లైన్‌లో నిలబడి లోకేశ్‍తో సెల్ఫీలు దిగారు. అనంతరం పుంగనూరు నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో 33వ రోజు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు 'సెల్ఫీ విత్ లోకేశ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో లోకేశ్‍తో సెల్ఫీలు దిగడ కోసం టీడీపీ శ్రేణులు, లోకేశ్ అభిమానులు బారులు తీరారు. ఈ క్రమంలో సాధారణ కార్యకర్తల్లా మాజీ మంత్రి అమరన్నాథ్ రెడ్డి, సీనియర్ నేత పయ్యావుల కేశవ్ క్యూలైన్లలో నిలబడి లోకేశ్ వద్దకు చేరుకున్నారు.
అనంతరం వారి చరవాణిని లోకేశ్‍కు ఇచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. సాధారణ కార్యకర్తలతో కలిసి నేతలుక్యూ లైన్లో రావడంతో లోకేశ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. సీనియర్ నేతలు తమతో కలిసి రావడం ఎంతో ఆనందంలో మునిగిపోయారు పార్టీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు.
నారా లోకేశ్ మాట్లాడుతూ.. ''33 రోజుల పాదయాత్రకే వైసీపీలో తీవ్ర వణుకు పుట్టింది. నా పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ వాళ్లు నానా తంటాలు పడుతున్నారు. ఆఖరికి మాట్లాడేందుకు వేసుకున్న స్టూల్‌ను కూడా లాక్కుంటున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం యువత ఆశగా ఎదురుచూసి అలసిపోయింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. సంపూర్ణ మద్యపాన నిషేధమన్నారు.. ఇప్పటికీ ఆ విషయం గురించి ఏమైందో జగనే చెప్పాలి. గంజాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది'.' అని అన్నారు.
ఆ తర్వాత పుంగనూరుకు ఎప్పుడొచ్చినా ముందు గుర్తొచ్చేది పెద్దిరెడ్డి పాపాలు, ఆయన చేస్తున్న ఆరాచకాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడి, మామిడి రైతులను పెద్దిరెడ్డి తీవ్రంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమూల్ సంస్ధ పాలు సేకరిస్తున్నా.. పుంగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశం లేదని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్ధ శివశక్తి డైరీకి లబ్ధి చేకూర్చేందుకు పుంగనూరులోకి అమూల్ సంస్ధను పాలు సేకరించకుండా నిలిపివేశారని లోకేశ్ ఆగ్రహించారు.
మామిడి రైతులు తమ ఉత్పత్తులను ఇతర పరిశ్రమలకు తరలించుకునేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తన సొదరుడు మామిడి గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేశారని మామిడి రైతులందరూ అక్కడికే తరలించాలని.. దౌర్జన్యం చేస్తున్నారంటూ మండిపడ్టారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మామిడి, పాడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి