తిరుపతి జిల్లా పాకాల మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో.. సబ్ రిజిస్టర్ కార్యాలయం, రోడ్డు&భవనాల వసతి గృహానికి సరఫరా ఆపేసినట్లు.. విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. బిల్లులు సరిగా చెల్లించని తహసీల్దార్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. కొంత సమయం కోరడంతో ప్రస్తుతానికి తహసీల్దార్ కార్యాలయానికి సరఫరా కొనసాగిస్తున్నట్లు వివరించారు.
పాకాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సుమారు 16 లక్షలు బకాయిలు ఉన్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. అందువల్లే.. విద్యుత్ సరఫరా నిలిపేసినట్టు చెప్పారు. కరెంట్ లేకపోవడంతో.. గత నాలుగు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్వర్టర్ల సాయంతో పనులు చేస్తున్నారు. రోడ్లు-భవనాలశాఖ విశ్రాంతి భవనానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉద్యోగులు తాళాలు వేసేశారు.
ఇదీ చదవండి: