ETV Bharat / state

తిరుపతిలో మైనర్​ అత్యాచారం కేసు.. నిందితులు అరెస్టు - తిరుపతి జిల్లా

Arrest: తిరుపతి జిల్లా కేవిబి పురం మండలంలో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో నిందితుడిని అతనికి సహాయం చేసిన ఇద్దర్ని అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ తెలిపారు. వారిని రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

తిరుపతి జిల్లా అత్యాచార
తిరుపతి జిల్లా అత్యాచార నిందితుల అరెస్టు
author img

By

Published : Sep 4, 2022, 10:47 PM IST

Arrest: తిరుపతి జిల్లా కేవిబి పురం మండలంలోని మైనర్​ బాలిక అత్యాచార ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు వెట్టి సెల్వం అలియాస్ సెల్వరాజ్ అతనికి సహాయపడిన గుణశేఖర్, అశోక్​లను అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. నిందితులను గుర్తించడానికి మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. లక్షీపురం గ్రామ సర్కిల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణలో వారు నేరం అంగికరించారని.. వారిని రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

అసలేం జరిగింది: ఊరంతా వినాయక చవితి వేడుకల్లో ఉండగా.. బుధవారం అర్ధరాత్రి కేవీబీ పురం మండలంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ముగ్గురు యువకులు దుశ్చర్యకు పాల్పడినట్లు మొదట అనుమానాలు వ్యక్తం కాగా.. ఘటనలో ముగ్గురి ప్రమేయం ఉండగా.. ఒక్కరే అత్యాచారం చేసినట్లు చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులకు బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేవీబీ పురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని (14) తన తల్లితో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాలను చూసేందుకు వెళ్లింది. బాలికకు కడుపు నొప్పి రావడంతో రాత్రి 10 గంటల సమయంలో కుమార్తెను ఇంట్లో వదిలేసిన తల్లి తిరిగి వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కుమార్తె కనిపించకపోవడంతో గ్రామంలో వెతికినా ప్రయోజనం కనిపించలేదు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంటి ఆవరణలోని స్నానాల గది వద్ద తన కుమార్తె అపస్మాకరస్థితిలో పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఏం జరిగిందో ఆరా తీయగా.. తాను స్నానాల గదికి వెళ్లిన సమయంలో నిందితులు సెల్వం, గుణ, అశోక్‌ తనను అపహరించినట్లు బాధితురాలు తల్లికి వివరించింది. తనను సమీపంలోని శ్మశానవాటికకు తీసుకెళ్లి కర్రతో మోదగా.. తాను కిందపడిపోవడంతో గుణ, అశోక్‌లు అక్కడి నుంచి పరారయ్యారని.. సెల్వం తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత అర్ధరాత్రి తిరిగి తన ఇంటి ఆవరణలోనే బాత్‌రూం వద్ద సెల్వం వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు తల్లికి తెలియజేసింది. ఈ మేరకు బాధితురాలి తల్లి గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితులపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.