E SHRAM PORTAL ఈ-శ్రమ్ పోర్టల్ ఏకీకరణే లక్ష్యంగా 2 రోజుల జాతీయ కార్మిక సదస్సును కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తిరుపతిలో ప్రారంభించారు. సభ ప్రారంభంలో సదస్సును ఉద్దేశించి అంతర్జాల వేదిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. 29 కార్మిక చట్టాల్ని నాలుగు తేలికైన లేబర్ కోడ్‌లుగా మార్పు చేశామన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కార్మికశక్తి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ సదస్సుకు 25 రాష్ట్రాలకు చెందిన కార్మిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. సామాజిక రక్షణ, అందరికీ మెరుగైన ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న భద్రతా పథకాల సమన్వయం కోసం తొలి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధునాతన సాంకేతికతో కూడిన ఎగ్జిబిషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: