MLA Adimulam return from programme: 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరిట జనంలోకి వెళ్లిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు నిరసన సెగ తగిలింది. కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లిన ఎమ్మెల్యేను వివిధ సమస్యలపై స్థానికులు నిలదీశారు. ఇళ్ల బిల్లులు మంజూరు కాలేదని.. దాంతో అప్పుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పథకానికి విద్యుత్ సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. గ్రామస్థులకు నచ్చజెప్పేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. సమస్యలపై నిలదీయటంతో గ్రామం నుంచి ఎమ్మెల్యే తిరుగుముఖం పట్టారు.
ఇదీ చదవండి :