Mnister Roja Visited Tirumala Temple : పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని పర్యాటక శాఖా మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జబర్ధస్త్ టీం సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని రోజా తెలిపారు. స్వామివారి దివ్యరుపాన్ని ఎన్నిసార్లు చూసిన మర్చిపోలేనిదన్నారు. తన కూతురు, కుమారుడు సినిమాల్లో ఆరంగేట్రం చేస్తే ఒక తల్లిగా, నటిగా చాలా సంతోషిస్తానని తెలిపారు. తన కూతురుకు సైంటిస్టు అవ్వాలనే ఆలోచనలో ఉందని, ప్రస్తుతానికి సినిమాలో నటించే ఆలోచన లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.
MINISTER ROJA AT TIRUPATI GANGAMMA TEMPLE : తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను పర్యాటక శాఖా మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. గంగమ్మ ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ ఛైర్మన్, ఈవో, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రోజా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. తాను చదువుకున్న తిరుపతిలో.. మంత్రిగా రావడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానట్లు తెలిపారు. ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ద్వారా తాను వైకాపాలోకి రావడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసే శక్తిని, ఆరోగ్యాన్ని అందించాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: