ETV Bharat / state

తిరుపతిలో 'హలో లోకేశ్‍'.. యువతతో పలు అంశాలు పంచుకున్న యువనేత - జగన్ పై లోకేశ్ ఆరోపణలు

Nara Lokesh on cm jagan: జగన్‍ రెడ్డి ఆరాచక పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ అన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తెదేపా లక్ష్యమని తెలిపారు. 26వ రోజు పాదయాత్రలో భాగంగా తిరుపతి నగరంలో హలో లోకేశ్‍ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్ధులు, నిరుద్యోగులు, యువతీ, యువకులతో హలో లోకేశ్‍ కార్యక్రమం ఘనంగా సాగింది.

Nara Lokesh
నారా లోకేశ్
author img

By

Published : Feb 24, 2023, 10:55 PM IST

Updated : Feb 25, 2023, 6:17 AM IST

హలో లోకేశ్​ కార్యక్రమంలో యువతతో మాట్లాడిన లోకేశ్

Nara Lokesh 26th Day Padayatra: టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటుందని యువనేత లోకేశ్‍ తెలిపారు. యువత భవిష్యత్‍ కోసమే యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నానని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. తిరుపతి నగర శివారు తాను బస చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన హలో లోకేశ్‍ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఐఎం ప్రొఫెసర్ రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. సాధారణ సమావేశాలకు భిన్నంగా హలో లోకేశ్‍ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైదానం మధ్యలో వేదికను ఏర్పాటు చేయగా... వేదికకు మూడు వైపులా విద్యార్ధులు ఆశీనులయ్యేలా ఏర్పాటు చేశారు. లోకేశ్‍ వేదికకు చేరుకుంటున్న సమయంలో కార్యక్రమానికి హజరైన యువతీ, యువకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు.

ఇప్పటి వరకు 350 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని.. ప్రజల ఆశీర్వాదంతో నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తానని లోకేశ్‍ తెలిపారు. ఉన్నత కుంటుంబం నుంచి వచ్చినా.. బడుగు బలహీన వర్గాల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వివరించారు. వైకాపా నేతలు తనపై చేస్తున్న విమర్శలు పట్టించుకోనని రాష్ట్ర అభివృద్ది మాత్రమే తన లక్ష్యమన్నారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాకు జోహో, సెల్‍ కాన్‍, టీసీఎల్‍, డిక్సన్‍ వంటి పరిశ్రమలతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని లోకేశ్ తెలిపారు. నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంగా తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో ఇప్పటి వరకు 9 శాతం పూర్తి చేశానని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా... యువత కోసం వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగుతున్నానన్నారు.

మెగాస్టార్​ అభిమానిని: జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్ధ్గులు పలు అంశాలపై నారా లోకేశ్​ను ప్రశ్నించారు. ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... తాను మెగాస్టార్‍ చిరంజీవి అభిమానినని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు ఉండవన్న ప్రచారంపై సమాధానం ఇవ్వాలని మరో విద్యార్ధి ప్రశ్నించారు. విద్యార్ధులకు సమాధానమిస్తూ సంక్షేమం, అభివృద్ది సమపాళల్లో సాగుతాయన్నారు. స్ధూలకాయం నుంచి సాధారణ స్ధితికి రావడానికి.. పూర్తి స్ధాయిలో ఫిట్​నెస్‍ సాధించడానికి తన భార్య బ్రాహ్మణి చొరవ ఉందన్నారు. కొవిడ్‍ సమయంలో పరిగెత్తించేదని, ఆహారాన్ని నియంత్రించేదని తెలిపారు. 27వ రోజు తిరుపతి నగరంలో పాదయాత్ర నిర్వహించనున్నారు.

ఇవీ చదంవడి:

Last Updated : Feb 25, 2023, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.