ETV Bharat / state

తితిదే అతిథి గృహాల్లో భారీగా అద్దెల పెంపు...సామాన్యులకు భారం - తిరుమల దర్శనం

Room rents increased in Tirumala: ఆపదమొక్కులవాడి దర్శనంతో తమ బాధలన్నీ తొలగిపోతాయని... రోజూ వేల మంది భక్తులు అపార విశ్వాసంతో తిరుమలకు వెళ్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు వసతి సదుపాయం ఇన్నాళ్లూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల వసతిగృహాల ధరలు అమాంతం పెంచేశారు. వెంకటేశా...కొండపై ఉండేదెలా..? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైపైచ్చు లడ్డూల ధరలూ భారమూ భక్తులపై అధికంగానే ఉంది. కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే ...ఛార్జీలు మోతక్కిస్తున్నాయి. మొత్తంగా తిరుమలేశుడి దర్శనానికి వెళ్లాలంటే .... అంత వ్యయం మనం భరించగలమా అని సామాన్యుడి అనుకొనే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారు.

TIRUMALA
TIRUMALA
author img

By

Published : Jan 12, 2023, 9:01 AM IST

శ్రీవారి దర్శనం...సామాన్యులకు భారం

Room rents increased in Tirumala: ఒక రోజుకు ఒక గదికి 150 రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు 17 వందలు. 200 ఉన్న పెద్ద గది అద్దె ఇప్పుడు 2 వేల 200కు పెరిగింది. లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ఏదైనా ప్రైవేటు హోటల్‌ యాజమాన్యం.. ఇలా ధరలు ఇష్టానుసారం పెంచిందనుకుంటే పొరపాటే. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కనులారా దర్శించుకోవాలని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వడ్డిస్తున్న ధరల వాతలివి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లాభాపేక్ష లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ వాణిజ్య ధోరణిలో ఆలోచిస్తూ గదుల అద్దెలు పెంచడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, టీటీడీ పాలకవర్గం.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై కాకుండా, వారి నుంచి డబ్బు పిండటంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే లడ్డూ సహా ప్రసాదాల ధరలు పెంచి భక్తులపై భారం మోపిన టీటీడీ.. క్రమంగా తిరుమల కొండపై ఉన్న అతిథి గృహాల్లో గదుల ధరల్నీ ప్రైవేటు హోటళ్ల తరహాలో పెంచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

టీటీడీ ఒకానొక దశలో వివిధ ఆర్జిత సేవల ధరల్ని పెంచాలని ప్రయత్నించి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. టీటీడీ పాలక మండలి సమావేశంలో... అధికారులు ఒక ధర చెబితే, దాన్ని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మరిన్ని రెట్లు పెంచేస్తూ.. వేలంపాట పాడినట్టుగా శ్రీవారి సేవల టికెట్‌ ధరల్ని పెంచాలనుకున్న తీరు అప్పట్లో టీవీ ఛానళ్లలో ప్రత్యక్షంగా ప్రసారమైంది. అది తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది. దాంతో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై టీటీడీ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత టీటీడీ పాలక మండలి సమావేశాల్నీ ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. ఆ పరిణామంతో ఆర్జిత సేవల టికెట్ల పెంపు ప్రతిపాదనల్ని విరమించుకున్న టీటీడీ గదుల అద్దెలు పెంచడం, భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూల సంఖ్యను కుదించడం, ప్రసాదం ధరల పెంపు లాంటి చర్యలకు పాల్పడుతోంది. ఆర్జితసేవా టికెట్ల ధరలు ఎంత పెంచినా సామాన్యులకు ఇబ్బంది లేదు. అవి కొనేవారిలో ఆర్థిక స్తోమత, పలుకుబడి గలవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ గదుల అద్దెల పెంపు భారం ఎక్కువగా సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతిపైనే పడుతోంది. కావాలంటే ధనికులు ఉపయోగించే, ఎక్కువ సౌకర్యాలున్న అతిథి గృహాల్లో ధరలు పెంచి, సామాన్యులపై భారం లేకుండా చూడొచ్చు. సామాన్యులుండే అతిథి గృహాల్లో స్వల్పంగా పెంచినా ఇబ్బంది పడరు. 2022-23 సంవత్సరానికి టీటీడీ బడ్జెట్‌ 3 వేల96.40 కోట్లు. అంత భారీ బడ్జెట్‌ ఉన్న టీటీడీ.. తలుచుకుంటే సామాన్య భక్తులపై భారం పడకుండా చూడలేదా? ఇలా అడ్డదిడ్డంగా పెంచడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

సినిమా టికెట్ల ధరల్ని తగ్గించడాన్ని సమర్థించుకుంటూ..

ముఖ్యమంత్రి జగన్‌ గత ఏడాది జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన సభలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై మాట్లాడారు. పేదల వినోదంపైనే అంత శ్రద్ధ కనబరిస్తే.. ప్రజలంతా కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే ఆ శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని మరింత సులువుగా, పెద్దగా ఆర్థిక భారం లేకుండా సామాన్యులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? తిరుమల కొండపై సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఎస్వీ, నారాయణగిరి అతిథి గృహాల్లో గదుల అద్దెలను ఒక్కసారిగా 150 నుంచి 17 వందలకి పెంచడం ప్రజలపై పెనుభారం కాదా? ఒక్కసారిగా ధరల్ని 1133% పెంచడం ఎలా సమర్థనీయం? తిరుమలలోని అతిథి గృహాలు, కాటేజీల్లో వివిధ కేటగిరీల గదులు సుమారు 7 వేల 200 ఉన్నాయి. వాటిలో ఒక గదికి ఒకరోజు అద్దె..ఎస్ఎమ్ సీ, ఎస్ఎన్ సీ, ఎఎన్ సీ, హెచ్ వీసీ ల్లో 50 రూపాయలు, రాంబగీచా, వరాహస్వామి గెస్ట్‌హౌస్, ఎస్ఎన్ జీహెచ్, హెచ్ వీడీసీ, ఏటీసీ, టీబీసీల్లో 100 రూపాయలు, నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌హౌస్‌లలో 150 రూపాయలు, విష్ణుపాదంలో 250 రూపాయలు, వకుళమాత, కౌస్తుభం, పాంచజన్యం, నందకం అతిథి గృహాల్లో 500 రూపాయల చొప్పున ఉండేవి. ఇటీవల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత అతిథి గృహాల ధరల్ని వెయ్యికి పెంచేశారు. ఎస్వీ అతిథి గృహంలో 31 గదులుండగా, వాటి అద్దెను 150 నుంచి 17 వందలు చేశారు. ఇప్పుడు నాలుగు నారాయణగిరి అతిథి గృహాల్లోని 164 గదుల అద్దెలనూ పెంచేశారు.తిరుమలకు వెళ్లినవారు రెండు రోజులు ఉండాలనుకుంటే.. మొదట ఒకరోజుకు గది కేటాయించి తర్వాత మరో రోజుకు పొడిగిస్తారు. ఒకరోజు దాటాక ఒక గంట ఉన్నా, రెండు గంటలున్నా మొత్తం రోజుకు అద్దె కట్టాలి. ఇదివరకు నారాయణగిరి అతిథి గృహంలో రెండు రోజులున్నా అద్దె 300 అయ్యేది. పెంచిన ధరల ప్రకారం 3 వేల400 అవుతుంది.

శ్రీవారికే కాదు... భక్తులకూ తిరుమలకొండపై ప్రసాదంగా ఇచ్చే లడ్డూ అత్యంత ప్రీతిపాత్రం. వైసీపీ అధికారంలోకి వచ్చాక... లడ్డూ ధరల్ని పెంచేసి, స్వామివారి ప్రసాదాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది. గతంలో 25 ఉన్న లడ్డూ ధరను 50కి పెంచారు. 25 ఉన్న వడ ధరను నాలుగు రెట్లు పెంచేసి 100 రూపాయలు చేసింది. కల్యాణం లడ్డూధరను 100 నుంచి 200కి పెంచింది. ఇదివరకు కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ‘దివ్యదర్శనం’ సౌకర్యం ఉండేది. రోజుకు 20వేల మందికి టోకెన్లు ఇచ్చేవారు. వారికి ఉచితంగా ఒక లడ్డూ, దానికి అదనంగా రెండు లడ్డూలు 10 రూపాయల చొప్పున, మరో రెండు లడ్డూలు 25రూపాయల చొప్పున అందజేసేవారు. కాలినడకన వెళ్లే భక్తులకు ఉచిత లడ్డూతోపాటు, 70 వెచ్చిస్తే మరో నాలుగు లడ్డూలు లభించేవి. ఇప్పుడు ఏకంగా దివ్యదర్శనాన్నే ఎత్తేశారు. సర్వదర్శనం, స్లాట్‌ దర్శనానికి వచ్చేవారికీ ఇదివరకు ఒక ఉచిత లడ్డూ, 70 రూపాయలకి మరో నాలుగు లడ్డూలు దొరికేవి. ఇప్పుడు ఒక ఉచిత లడ్డూ మాత్రమే ఇస్తున్నారు. బ్రేక్, సుపథం దర్శనాలకు వెళ్లినవారికి ఇది వరకు 2 లడ్డూలు ఇస్తే.. ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ టికెట్‌ ఛార్జీలను మూడుసార్లు పెంచడం తిరుమల వెళ్లే భక్తులకు భారంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో టికెట్‌ ధర 75 ఉండేది. దాన్ని డీజిల్‌ సెస్‌ పేరుతో ఒకసారి 85కి, ఆ తర్వాత మళ్లీ 90కి పెంచారు. రెండు వైపుల టికెట్‌ ఒకేసారి తీసుకుంటే 160 రూపాయలకి ఇస్తున్నారు. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం గుడివాడ నుంచి బస్సులో తిరుమల వెళ్లి, నారాయణగిరి అతిథి గృహంలో రెండు రోజులు బసచేసి శ్రీవారిని దర్శించుకుని రావాలంటే కనీస వ్యయం 17వేలు అవుతుంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.