EX PRP LEADERS MEETING : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, తిరుపతిలో శాంతి నెలకొల్పటమే తమ మొదటి ప్రాధాన్యత అని పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు తెలిపారు. తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన పూర్వ ప్రజారాజ్యం పార్టీ ఆత్మీయ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. చిరంజీవి వెంట ఉన్న నేతలంతా జనసేన, తెదేపా కోసం పని చేస్తామని తెలిపారు. వైకాపా అరాచకాలను సమిష్టిగా ఎదుర్కొంటామన్నారు. 'మూడు రాజధానుల వద్దు.. ఒక రాజధానే ముద్దు' అన్నది ప్రజల్లో ఉందన్నారు. తిరుపతిలో నిర్వహించిన రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన.. బలవంతపు ప్రదర్శన అని.. నగరంలో వైకాపా ఆరాచకాలను అడ్డుకుంటామన్నారు. 2024లో తెదేపా-జనసేన-భాజపా కలిసి బరిలో దిగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
ఇవీ చదవండి: