sand : ప్రభుత్వం తాము సాగు చేసుకోవటానికి ఇచ్చిన భూముల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాత శానంబట్లలో రైతులు ఆందోళనకు దిగారు. తమకున్న కొద్దిపాటి భూముల్లో పంటలే తమకు జీవానాధారం అని.. వాటిని కూడా దూరం చేస్తున్నారని వాపోయారు. గత కొన్ని నెలల క్రితం భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి నది ప్రవాహం ధాటికి పంటపొలాల్లో ఇసుక మేటలు ఏర్పాడ్డాయని.. ఇసుకను తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను తోడేందుకు వచ్చిన యంత్రాన్ని అడ్డుకున్నారు.
50 ఏళ్ల క్రితం ప్రభుత్వం తమకు డీకేటీ పట్టాలు ఇచ్చిందని..,తమ అనుమతి లేకుండా ఇసుకను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. తమ పంట పొలాలపై ఉన్న ఇసుక మేటలను తరలిస్తే..సాగు భూమి పనికిరాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇసుకను తరలించడానికి తమకు అన్ని అనుమతులు ఉన్నాయని కాంట్రాక్టర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాగా.. స్వర్ణముఖి వాగులో ఇసుకను తరలించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తమ భూముల్లో ఇసుకను తరలిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు...రైతుల వద్ద పాసు పుస్తకాలు, ఆధారాలతో వారిని ఎమ్మార్వో కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఇవీ చూడండి