ETV Bharat / state

Crime News in AP: తిరుమల ఘాట్​ రోడ్డులో ఆగని ప్రమాదాలు.. ఒక్కరోజే 4 ఘటనలు - raod accidents in ap

AP Crime News: రాష్ట్రంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Crime News in AP
Crime News in AP
author img

By

Published : Jun 12, 2023, 11:41 AM IST

AP Crime News: తిరుమలలో వరుస రోడ్డు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 4 ప్రమాదాలు జరగటం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. తమిళనాడు భక్తులు శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా.. మొదటి ఘాట్ రోడ్డులోని నాలుగో మలుపు వద్ద వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ వాహనంలో 12 మంది ప్రయాణిస్తుండగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో ముంబయికి చెందిన భక్తుల టెంపో వాహనానికి బ్రేకులు పనిచేయక.. డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మూడో ప్రమాదంలో మొదటి ఘాట్ రోడ్డులో 15వ మలుపు వద్ద బెంగుళూరుకు చెందిన భక్తుల కారు బ్రేకులు వైఫల్యంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అలాగే మాల్వడి గుండం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.ఈ రెండు ప్రమాదాలలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ రోడ్డు వద్ద.. పర్యాటకుల కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు.. విశాఖ ఆస్పత్రికి తరలించారు. విశాఖకు చెందిన పర్యాటకులు.. ఆదివారం కావడంతో పర్యాటక కేంద్రం మధ్య గుండాన్ని సందర్శించి.. తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకంది. ఘాట్‌ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో.. పల్టీలు కొడుతూ లోయలోకి దూసుకెళ్లింది.

ఏటీఎంలో చోరీకి యత్నం: NTR జిల్లా నందిగామ మార్కెట్ యార్డు సమీపంలోని S.B.I. ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. గ్యాస్‌సిలిండర్‌, కట్టర్‌ సాయంతో ఏటీఏం తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో గ్యాస్‌సిలిండర్‌ను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ATM లోని మెయిన్ బాక్స్ ఓపెన్ అవ్వలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు.

బైక్​ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకరు మృతి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రేగుపాలెం వద్ద.. బైక్‌పై వెళ్తున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెనపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు, చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.