ETV Bharat / state

Aarogyasri Funds : నకిలీ రోగులు.. నకిలీ బిల్లులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో అక్రమాలు - తిరుపతి రుయా ఆసుపత్రి ఆరోగ్యశ్రీ

Aarogyasri Funds : తిరుపతి రుయా ఆసుపత్రి ద్వారా ఆరోగ్యశ్రీ ఆసరా నిధులు పక్కదారి పట్టాయి. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేసుకున్నరోగులను డిశ్చార్జి చేసే సమయంలో మందులకు ఆసరాగా చెల్లించే మొత్తాల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారిని సైతం రోగులుగా నమోదు చేసి.. రెండ్రోజులు ఆసుపత్రిలో ఉంచి డిశ్చార్జి చేసి నిధులు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆరోగ్యశ్రీ విభాగంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లపై కేసులు నమోదు చేశారు.

aarogyasri
aarogyasri
author img

By

Published : Apr 16, 2023, 3:25 PM IST

తిరుపతి రుయా ఆసుపత్రిలో పక్కదారిపట్టిన ఆరోగ్యశ్రీ ఆసరా నిధులు

Corruption in Aarogyasri Scheme : ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేసి వైద్య సేవలు అందించిన ఆసుపత్రులు.. కోట్ల రూపాయల బకాయిలతో ఇబ్బందులు పడుతుంటే.. తిరుపతి రుయా ఆసుప్రతిలో మాత్రం ఆరోగ్యశ్రీ ఆసరా నిధులను పక్కదారి పట్టించారు. నర్సింగ్‌ సిబ్బంది, వైద్యుల సహకారంతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడి 13 లక్షల రూపాయలు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుపతిలోని జీవకోనకు చెందిన మునెమ్మ అనే మహిళను.. పక్షవాతం రోగిగా ఓపీ తీసుకుని మెడిసిన్ వార్డులో చేర్పించి అక్రమాలకు పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేసినట్లు దస్త్రాలు సృష్టించి మందుల ఆసరా నిధులు 30 వేల రూపాయలు మునెమ్మ ఖాతాకు జమ చేశారు. బ్యాంకుకు తీసుకెళ్లి నగదు డ్రా చేసి ఆమె చేతితో 10 వేల రూపాయలు పెట్టి మరో ఇరవై వేల రూపాయలు నొక్కేశారు. ఇలా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో 44 మందిని ఆసుపత్రిలో చేర్చి.. ఒక్కొక్కరి పేరుమీద ముప్పై వేల రూపాయలు చొప్పున ఆరోగ్యశ్రీ ఆసరా నిధులు 13 లక్షల రూపాయలు స్వాహా చేశారు.

రుయాలో ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగే శస్త్ర చికిత్సల నమోదుకు.. డేటా ఎంట్రీ ఆపరేటర్లను పొరుగుసేవల కింద రుయా యాజమాన్యం నియమించుకుంది. కాల పరిమితి పూర్తయినా అనధికారికంగా కొందరు వైద్య విభాగాధిపతులు.. ఐదుగురు డీటీవోలను కొనసాగించారు. ఇందులో కొంతమంది డీటీవోలు చేతివాటం చూపించారు. కొందరు వైద్యులు, ఆరోగ్య మిత్రల సహకారంతో రోగులు కానివారిని రుయాకు తీసుకొచ్చి పక్షవాతానికి గురైనట్లు.. ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్యశ్రీలో నమోదు చేశారు. అప్పటికే పక్షవాతానికి గురైన రోగికి వైద్యులు సూచించే వైద్యం తాలూకు కేసు షీట్లలో పేరు, ఓపీ నంబరు, బార్ కోడ్ తొలగించి నకిలీ రోగుల వివరాలు పొందుపరిచారు. పాత సీటీ స్కాన్ రిపోర్టులో బార్‌ కోడ్‌ దిద్దేసి అప్లోడ్ చేశారు. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతులు మంజూరు కావడం.. డిశ్చార్జ్ అనంతరం రోగి బ్యాంకు ఖాతాకు 30 వేల రూపాయలు ఆరోగ్య ఆసరా జమ అయ్యేది.

2019 నుంచి ఇప్పటివరకు రుయాలో 170 కేసులకు ఆరోగ్య ఆసరా నిధులు మంజూరు చేశారు. ఇందులో ఎన్ని నిజమైనవి.. ఎంత మేరకు దోచుకున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. రుయా ఆసుపత్రిలో ఆరోగ్య ఆసరా నిధులు పక్కదారి పట్టిన తీరుపై ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలపై పొరుగు సేవల ఉద్యోగులను బాధ్యులుగా చూపి...పోలీసు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.