CM Jagan Visited Cyclone Affected Area: మిగ్‌జాం తుపానుతో నష్టపోయిన ప్రతి రైతునీ ఆదుకుంటామని సీఎం జగన్ అన్నారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. జగన్ పర్యటనలో భాగంగా రైతులు, బాధితుల వద్దకు వెళ్లకుండా వారినే తన వద్దకు పిలిపించుకున్నారు. ఆదుకోవడంలో గత ప్రభుత్వాల కన్నా తాము ముందున్నామన్న జగన్, సాయంపై ఎవరెవరో చెప్పేవాటిని నమ్మవద్దని సూచించారు. సంక్రాంతిలోగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్: తిరుపతి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. ముందుగా ఏరియల్ సర్వే ద్వారా పంటల నష్టాన్ని సీఎం జగన్ పరిశీలించారు. ఆ తర్వాత వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తుపాన్ ప్రభావిత ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: పురందేశ్వరి
CM Jagan With Cyclone Victims : నేరుగా బాధితుల వద్దకు వెళ్లని సీఎం వారందర్నీ బాలిరెడ్డిపాలెం పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పటికే 92 రిలీఫ్ క్యాంపులు పెట్టి 8 వేల 360 మందిని తరలించామని సీఎం తెలిపారు. బాధితులందరికీ 2 వేల 500 రూపాయలు సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరో వారంలో వాలంటీర్ల ద్వారా ఈ సాయం పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వ్యవస్థతో తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కర్నీ ఆదుకుంటామని చెప్పారు.
"దాదాపుగా 6వేల మందికి పైగా 25కిలోల రేషన్ బియ్యం, కందిపప్పు కేజి, ఫామయిల్ లీటరు, ఒక కేజీ ఉల్లిగడ్డ, కేజీ బంగాళదుంపలు ఇస్తున్నాము. పంటలు వేసి నష్టపోయిన వారికి 80 శాతం సబ్సీడితో విత్తనాలు కూడా అందిస్తాము. ఈ రోజు నుంచి వారం రోజులు పట్టవచ్చు గానీ, వారం లోపు అందరికీ సాయం అందుతుంది. స్వర్ణముఖి దగ్గర హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తే సరిపోతుంది. కచ్చితంగా ఆ బ్రిడ్జిని మంజూరు చేస్తాను" - ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం - రైతులకు మంత్రి కారుమూరి భరోసా
రైతులందరికి మేలు చేస్తాం: ఆ తర్వాత బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాతనందాయపాలెంలో తుపాను బాధిత రైతులతో సీఎం జగన్ మాట్లాడారు. పెట్టుబడి రాయితీ, పంటల బీమాపై ఎవరి మాటలనూ నమ్మవద్దని సూచించారు. రైతులందరికీ మేలు చేస్తామని హామీ ఇచ్చారు.
పరిహారం అందకపోతే నాకే చెప్పవచ్చు: పరిహారం రానివారు మరోసారి వివరాలు అందించవచ్చని సీఎం జగన్ స్పష్టం చేశారు. అప్పటికీ పరిహారం అందకపోతే కాల్‌సెంటర్ నంబర్ 1902 కి ఫోన్‌చేసి నేరుగా తనకే చెప్పొచ్చని పేర్కొన్నారు. సంబంధిత అంశాన్ని తానే పరిశీలించి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
తుపాను ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్ - ఆ రెండు జిల్లాల్లో పర్యటన