CENTRAL MINISTER NIRMALA SEETHARAMAN : తిరుమల వైకుంఠనాథుడిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి తితిదే ఈవో ధర్మారెడ్డి ఆలయ అధికారులతో స్వాగతం పలికారు. ఆలయంలో మూలమూర్తిని దర్శించుకొని మంత్రి మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో ధర్మారెడ్డి ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందించారు.
ఇవీ చదవండి: