Bhumana Karunakar Explained TTD Board Meeting Decisions: తిరుమల తిరుపతి దేవస్థానంలోని అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అంతేకాకుండా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి పునర్నిర్మాణానికిి నిధులు మంజూరు చేస్తున్నామని వివరించారు. అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాన్ని నిర్వహించారు. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.
ఈ నెల 23న అలిపిరి గోశాల వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభం కానుందని వెల్లడించారు. వడమాల పేట వద్ద పాదిరేడు గ్రామంలోని టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో.. మట్టి రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. 130 కోట్లతో కోనుగోలు చేసిన అదనపు స్థలంలోని మట్టి రోడ్డు నిర్మాణానికి.. టెండర్ ఆహ్వానం కోసం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
"114 జీవో ప్రకారం.. విధివిధానాలకు లోబడి ఎవరికైతే అర్హత ఉందో వారిని రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. వచ్చే బోర్డులో ఎంతమంది వస్తారనేది ప్రకటిస్తాం. తిరుచానూరు అమ్మవారి భక్తుల రద్దీ దృష్ట్యా.. రోడ్డును 80 అడుగులు విస్తరణకు నిర్ణయం తీసుకున్నాము." -భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ చైర్మన్
'అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణ అందుకే' - డిసెంబర్ 23నుంచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం : టీటీడీ ఈవో
బ్రహ్మెత్సవాలను విజయవంతం చేసినందుకు బహుమతులు: టీటీడీలోని విశ్రాంత ఉద్యోగులకు ఇంటిస్థలం కేటాయిస్తామని అన్నారు. సాలకట్ల, నవరాత్రి బ్రహ్మెత్సవాలను విజయవంతం చేసిన ఉద్యోగులకు బహుమతులు అందిస్తున్నట్లు వివరించారు. శాశ్వత ఉద్యోగులకు రూ. 14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 6,850 రూపాయలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
పలు నిర్మాణాలకు అనుమతులు: అలిపిరి వద్ద గిడ్డంగిలో మరో భవన నిర్మాణానికి రూ. 11 కోట్లు మంజూరు చేశామన్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి.. భక్తుల రద్దీ రోజు రోజుకు పెరగిందని వివరించారు. అందువల్ల మంగళంలోని ఆర్టీఓ కార్యాలయం నుంచి రేణిగుంట ఫ్లోర్మిల్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి రూ. 15.12 కోట్లు మంజూరు చేశామన్నారు.
స్విమ్స్ ఆసుపత్రి పునర్నిర్మాణానికి నిధులు: వకూళమాత ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో.. పుదిపట్ల జంక్షన్ నుంచి వకూళమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. స్విమ్స్ ఆస్పత్రిలో న్యూరో, కార్డియో విభాగాల కోసం నూతన భవనాల నిర్మాణానికి నిధుల మంజూరుకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు.
భక్తుల భద్రతకు చర్యలు: తిరుమల నడకదారుల్లో వన్యమృగాల నుంచి భక్తుల భద్రత కల్పించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. అటవీ శాఖ భద్రతా పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. కరీంనగర్లోని శ్రీవారి ఆలయం నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
TTD Good News : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. డిసెంబర్ తర్వాత మరో లోకంలోకి భక్తులు!