- నేడు మంగళగిరిలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించనున్న సీజేఐ
ఏపీ జ్యుడీషియల్ అకాడమీని నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర న్యాయాధికారుల సమావేశంలోనూ సీజేఐ పాల్గొననున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆయనను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బెజవాడ దుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్శించుకున్నారు.
- 16 లక్షల రేషన్ కార్డులను తొలగించారు.. అరాచక వైసీపీని గద్దెదింపే వరకూ పోరాటం : చంద్రబాబు
వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ప్రజలంతా కలసి పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అప్పులతో సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. తెదేపా సభలకు వస్తున్న స్పందనకు భయపడే అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పలికేందుకు ఇంటికొకరు తెదేపా జెండా పట్టుకుని రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
- చిత్తూరులో తానా చైతన్య స్రవంతి సంబరాలు.. దివ్యాంగులు, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
చిత్తూరు జిల్లాలో తానా ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, దివ్యాంగులకు సైకిళ్లను పంపిణీ చేయగా.. రైతులకు స్ప్రేయర్లను అందించారు. పలు రంగాలలో సేవలు అందించిన వ్యక్తులను సత్కరించారు.
- పదో తరగతిలో ఫెయిల్.. వ్యర్థాలతో సొంతంగా బైక్ తయారీ.. ఖర్చు రూ.10వేలే!
పదో తరగతి పాస్ కాని ఓ యువకుడు బైక్ తయారు చేశాడు. పనికిరాని వ్యర్థాలతో బైక్‌ను రూపొందించాడు. ఆ యువకుడి విజయగాథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
- 120 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం
రష్యా మరో సారి కీవ్ నగరంలో విధ్వంసం సృష్టించింది. దాదాపుగా 120 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారని.. జెలెన్స్కీ సలహాదారు తెలిపారు. ఈ ప్రభావంతో రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగింది.
- 'వివేకానంద, మెస్సీ స్ఫూర్తితో ముందుకు సాగండి'.. అంబానీ వారసులకు ముకేశ్ దిశానిర్దేశం
2023 చివరికల్లా దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ సేవలను విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ. ఈ మేరకు రిటైల్ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు. బుధవారం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో ఉద్యోగులనుద్దేశించి ముకేశ్ చేసిన ప్రసంగంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- రికార్డ్ టైటిల్స్‌తో మొదలై.. వివాదాలతో ముగిసి.. 2022 ఎంతో స్పెషల్
కొన్ని విజయాలు.. క్రీడా లోకాన్ని సంతోషంలో ముంచాయి. కొన్ని ఓటములు.. అభిమానులకు బాధ కలిగించాయి. కొన్ని నిష్క్రమణలు.. కన్నీళ్లు పెట్టించాయి.ఇలా.. ఎన్నో భావోద్వేగాల మిళితమై.. మరెన్నో భావాలకు రూపమై.. అంతర్జాతీయ క్రీడా రంగంలో 2022 ప్రత్యేకంగా నిలిచిపోయింది. కరోనా తగ్గడంతో ప్రపంచ టోర్నీలతో సందడి.. సూపర్ స్టార్ల మెరుపులతో సంబరం నెలకొంది. సంచలన ప్రదర్శనలు..చరిత్రలో నిలిచిపోయే విజయాలకు ఈ ఏడాది వేదికగా మారింది. మరి.. అంతర్జాతీయ క్రీడా రంగంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను ఓ సారి నెమరు వేసుకుందాం.. పదండి!
- ఒకే వేదికపై చిరు-బాలయ్య.. హోస్ట్‌గా మంచు విష్ణు.. ఫ్యాన్స్ సర్ప్రైజ్!
'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ కోసం ఓ భారీ స్పెషల్ ప్లాన్ వేస్తున్నట్లు సోషల్‌మీడియాలో టాక్ నడుస్తోంది. ఒకే వేదికపై చిరు-బాలయ్యను చేర్చే విధంగా ఓ బిగ్ ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.