ETV Bharat / state

తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

tirupati ruia hospital
tirupati ruia hospital
author img

By

Published : Apr 26, 2022, 9:46 AM IST

Updated : Apr 26, 2022, 3:42 PM IST

09:41 April 26

తమ అంబులెన్స్​లోనే తీసుకెళ్లాలని పట్టు..

తిరుపతిలో అమానవీయ ఘట

తిరుపతిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రుయా ఆస్పత్రిలో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని వేరే వాహనంలో తీసుకెళ్లకుండా అంబులెన్స్​ సిబ్బంది దారుణంగా వ్యవహరించారు.. వివరాల్లోకి వెళితే.. రుయాలో చికిత్స తీసుకుంటూ ఓ బాలుడు ఈ ఉదయం మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు అంబులెన్స్‌ పంపారు. ఈ క్రమంలో తమ వాహనంలోనే తీసుకెళ్లాలని రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు పట్టు పట్టారు. దీంతో చేసేదేమీలేక కుమారుడి మృతదేహాన్ని తండ్రి తన ద్విచక్రవాహనంపై సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం చిట్వేలుకు తీసుకెళ్లారు.

చర్యలకు డిమాండ్​: రుయా ఆస్పత్రి వద్ద తెదేపా, భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. విచారణ చేసేందుకు వచ్చిన ఆర్డీవోను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. అంబులెన్స్ డ్రైవర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహాప్రస్థానం వాహనాలను సరిగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఫల్యం: తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనను తెదేపా జాతీయధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించడం దారుణమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రుయా ఘటన వైద్యశాఖ దుస్థితికి అద్దం పడుతుందన్నారు.

ప్రైవేట్​ అంబులెన్స్​ల దందా: జగన్ పాలన వల్లే బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ప్రైవేట్ అంబులెన్స్‌ల దందా పెరగడం వల్లే రుయా లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మృతదేహాల ఉచిత తరలింపు కోసమే మహాప్రస్థానం వాహనాలు తెచ్చాం.. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మహాప్రస్థానం వాహనాలను మూలన పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలని లోకేశ్‌ డిమాండ్​ చేశారు.

తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి ఆర్డీవో, ఎస్పీ, డీఎంహెచ్​వో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అధికారులు.. ఆస్పత్రిలో కొన్ని సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. మృతదేహాలను దూరప్రాంతాలకు తరలించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని.. కలెక్టర్‌తో చర్చించి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అంబులెన్స్‌ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తిరుపతి ఆర్డీవో: రుయా ఆస్పత్రిలో జరిగినది దారుణమైన ఘటన అని... తిరుపతి ఆర్డీవో కనకనర్సారెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గతంలోనే పటిష్ఠమైన చర్యలు తీసుకున్నా... చాటుమాటుగా మళ్లీ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి ఆధారాలను బాధిత కుటుంబసభ్యులే తమకు అందజేశారని తెలిపారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

"బాధ్యులను గుర్తించాం. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. బాధ్యులను శిక్షించి ఇతరులకూ గట్టి సందేశమిస్తాం. అంబులెన్స్ సిబ్బంది అసోసియేషన్‌తో సమావేశం ఏర్పాటు చేస్తాం. ధరలు స్థిరీకరించి వాటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడంపై విచారణ జరుపుతాం. మహాప్రస్థానం వాహనం విషయంలో ఉన్న నిబంధనలు సరళీకరిస్తాం. నేరపూరిత సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు." - కనకనర్సారెడ్డి, తిరుపతి ఆర్డీవో

"ఇవాళ రుయా ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా విచారించి నివేదిక అందజేస్తాను. వేరే అధికారులను తప్పుపట్టడం సరికాదు. నాలుగు అంబులెన్సులు పనిచేస్తున్నాయి. ఇక్కడున్న అధికారులతో మాట్లాడాలి. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వాళ్లతో మాట్లాడితే మీకు స్పష్టతరాదు. ఇంతకు ముందు పక్క జిల్లాలకు కూడా వాహనాలను పంపేవాళ్లం. ఎక్కువ దూరం పంపితే ఎక్కువమందికి సర్వీస్​ చేయలేం. కాబట్టి తక్కువ దూరం వెళ్తామని, ఎక్కువ మందిని తీసుకెళ్తామనేది డ్రైవర్ల వాదన." - వైద్యురాలు, రుయా ఆస్పత్రి

" నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. దానిపై కలెక్టర్​ ఆదేశాల మేరకు డీఎస్పీ, ఆర్డీవో విచారణకు వచ్చారు. బాలుడి మృతదేహాన్ని తెలిసిన ఓ అంబులెన్స్​లో తరలించేందుకు అతడి తండ్రి ప్రయత్నించాడు. దీనిని రుయాలోని కొంత మంది అంబులెన్స్​ డ్రైవర్లు అతన్ని అడ్డుకున్నారు. తర్వాత అతను కొంత దూరం బైక్​పై తీసుకెళ్లి ఆ తర్వాత అంబులెన్స్​లో తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన ఆర్డీవో మూడు రకాల చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం.. అడ్డుకున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం. అంబులెన్స్​ సర్వీసులను రెగ్యులైజ్​ చేసి ప్రత్యేక కమిటీ ద్వారా కలెక్టర్​ ఆదేశాలు అమలు చేయడం. పూర్తి స్థాయి నివేదికను ఆర్డీవో కలెక్టర్​కు అందజేయనున్నారు. ఆ తర్వాత కలెక్టర్​ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి." - డీఎంహెచ్​వో

మారని తీరు: తిరుపతి రుయా ఆస్పత్రిలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రోగిని ఇంటికి తీసుకెళ్లేందుకు అధిక మొత్తంలో డబ్బు అడగడమే కాక.. బయటి నుంచి తెచ్చుకున్న అంబులెన్స్​ను ఆసుపత్రి అంబులెన్స్ నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో చివరి క్షణాల్లో ఇంటిదగ్గర గడపాల్సిన మనిషి.. అంబులెన్స్​లోనే కన్నుమూశాడు. అప్పట్లో అంబులెన్స్ నిర్వాహకుల దౌర్జన్యంపై అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి మండిపడ్డారు. విచారణ చేపట్టి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: సారూ... కాళ్లు పట్టుకుంటాం రక్షించండి

Last Updated : Apr 26, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.