మత్స్యకారుల వలసల నివారణకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద షిప్పింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సభాపతి తెలిపారు. సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక భరోసా అందిస్తుందన్నారు. వేట నిషేధిత కాలంలో జిల్లాలోని 14,289 కుటుంబాలకు లబ్ది చేకూరేలా రూ.14.28 కోట్లు కేటాయించినట్లు సభాపతి తెలిపారు.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించగా... శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి మాట్లాడారు.