తెదేపా దివంగత నేత ఎర్రన్నాయుడుకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రజానాయకుని సేవలను స్మరించుకుందామని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలనే కాకుండా, ఎన్టీఆర్‌ను సైతం ఆకర్షించిన వ్యక్తిత్వం ఎర్రన్నాయుడుదని కొనియాడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఇదీచదవండి