ETV Bharat / state

అంగన్ వాడీ ఆయాపై వైకాపా నాయకుల వేధింపులు! - srikakulam district latest updates

అధికార పార్టీ వైకాపాకు చెందిన కొందరు నాయకులు తనను వేధిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా రౌతు గ్రామానికి చెందిన అంగన్ వాడీ ఆయా వెంకటలక్ష్మీ ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

అంగన్ వాడీ ఆయాపై వైకాపా నాయకుల వేధింపులు

author img

By

Published : Aug 28, 2021, 7:17 PM IST

అంగన్ వాడీ ఆయాపై వైకాపా నాయకుల వేధింపులు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం రౌతు పేట గ్రామానికి చెందిన కునిబిల్లి వెంకటలక్ష్మి తనను వైకాపా నాయకులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆమె ఓ అంగన్ వాడి కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీ అయింది. కేంద్రంలో పనిచేస్తున్న ఆమె డిగ్రీ పూర్తి చేసి ఉన్న కారణంగా.. ఉన్నతాధికారులు తనను కేంద్రానికి టీచర్​గా పదోన్నతి కల్పించి ధ్రువీకరణ పత్రం జారీ చేశారని వెంకటలక్ష్మి తెలిపారు.

అయితే గ్రామంలోని వైకాపా నాయకులు.. ఆ పోస్టులో తమ వారికి అవకాశం కల్పించుకోవాలనే దురుద్దేశంతో ఆయాపై లేనిపోని ఫిర్యాదులు చేసి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎటువంటి తప్పు తాను చేయలేదని తేలినా.. అధికారులను సైతం ప్రలోభ పెట్టేందుకు వైకాపా నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె వాపోయారు.

కార్యకర్త పోస్టు నుంచి తప్పుకుంటే ఆయా పోస్టు ఉంటుంది.. లేదంటే ఆయా పోస్టు కూడా ఉందని వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. గ్రామస్థుల పిర్యాదు మేరకు అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీవో కె.రూపలత, జి.సిగడం సూపర్ వైజర్ అరుణకుమారి పరిశీలించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేసి గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ఇదీ చదవండి:

డ్రగ్స్ కేసు: నటుడు అర్మాన్ కోహ్లీ ఇంట్లో ఎన్​సీబీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.