Land Dispute In Srikakulam: భూ వివాదంలో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడన్నకోపంతో.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్త తెలుగుదేశం సానుభూతిపరుడిపై దాడి చేశాడు. వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురానికి చెందిన వాకాటి ఏర్రయ్యను గొరకల వెంకటరావు ఈడ్చు కెళ్లి రక్తం వచ్చేటట్టు కొట్టాడు. వెంకటరావుకు, గ్రామానికి చెందిన దండాసి మధ్య స్థల వివాదం ఉంది. ఆ వివాదానికి సాక్షిగా ఉన్న వాకాటి ఏర్రయ్య.. కోర్టులో వెంకటరావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఆ కోపంతోనే దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు..
ఇవీ చదవండి: