వైకాపా జడ్పీటీసీ అభ్యర్థిని సీఐపై చేయి చేసుకున్న ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. జడ్పీటీసీ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వారిని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ లలిత వరుసగా పంపుతున్నారు. సరుబుజ్జిలి వైకాపా అభ్యర్థిని లక్ష్మీనరసమ్మ క్యూను తప్పించుకుని వెళ్లబోయారు. అడ్డుకోబోయిన సీఐపై చేయి చేసుకున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి అక్కడకు చేరుకుని ఆరాతీశారు. పొరపాటున చేయి చేసుకున్నానని, మన్నించాలంటూ సీఐకి క్షమాపణ చెప్పడంతో విడిచిపెట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సీఐ ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు