POWER HOLIDAY: పవర్ హాలీడేలు పరిశ్రమలను బెంబేలెత్తిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి సోమవారం పవర్‌హాలీడేగా ప్రకటించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన రణస్థలం మండలం పైడిభీమవరంలో రసాయన, ఔషధ పరిశ్రమలు పెద్దఎత్తున్న ఉన్నాయి. ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. వీటితో పాటు పలాస, కాశీబుగ్గ పరిధిలో వందలాది జీడి పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. విద్యుత్తు కోతల ప్రభావం వీరిపైనా పడింది. దీంతో ఇప్పుడు అధికారికంగా పవర్ హాలీడే ప్రకటించడంతో తాము ఉపాధి కోల్పోతామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి పవన్ కల్యాణ్ కౌలురైతుల భరోసా యాత్ర