ETV Bharat / state

తాగి విధులకు వీఆర్వో హాజరు... మహిళా ఉద్యోగిపై అసభ్యప్రవర్తన... - complaint on chorlangi vro by surveyor

శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్స్ పేట మండలం చొర్లంగి సచివాలయం పరిధిలో పనిచేస్తున్న వీఆర్వోపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం తాగి మహిళా సర్వేయరు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Women surveyor complains about VRO
వీఆర్వోపై మహిళా సర్వేయరు ఫిర్యాదు
author img

By

Published : Sep 18, 2020, 9:19 AM IST

శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలంలోని చొర్లంగి సచివాలయ పరిధిలో వీఆర్వో తవుడు, సచివాలయం సర్వేయరుతో కలిసి ఎస్టీలకు పోడు పట్టాభూములు ఇచ్చేందుకు సర్వేకి వెళ్లారు. మద్యం తాగి విధులకు హాజరైన వీఆర్వో... మహిళా సర్వేయరును దూషించారు. వారించిన తోటి ఉద్యోగులను దుర్భాషలాడారు. ఆయన చేష్టలతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా సర్వేయర్​...వీఆర్వోపై సరుబుజ్జిలి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

వీఆర్వో తవుడు ప్రవర్తనపై మండలసర్వేయర్‌తోపాటు ఇతర ఉద్యోగులు తహసీల్దారు సత్యన్నారాయణకు ఫిర్యాదు చేయగా, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తహసీల్దారు తెలిపారు.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.