శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం జగన్నాధసాగరంలో ఉపాధి పనులు చేస్తుండగా కూలీ మృతి చెందింది. గ్రామానికి చెందిన పార్వతి ఉపాధి పనులు చేస్తుండగా.. వడదెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంపీడీవో సురేశ్ కుమార్కు సమాచారమివ్వగా.. ఆయన వచ్చి పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధరించారు.
ఆసుపత్రికి తరలించి శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె కుమారుడు, కుమార్తె వేరే ప్రాంతాల్లో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వారు రాలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యులే దహన సంస్కారాలు నిర్వహించారు.
ఇవీ చదవండి: