తిత్లీ తుపాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా నష్టపోయినపుడు సీఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక నేతలు చూపిన చొరవ ప్రజల్లో భరోసా కలిగించిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె...తుపాన్ నష్టాన్ని అంచనావేసి 21 రోజుల్లోనే 520 కోట్లు బాధితులకు అందించిన ఘనత తెదేపా ప్రభుత్వనిదేనని వ్యాఖ్యానించారు. కాశీబుగ్గలో రేపు సామాజికవేత్తలతో కలిసి గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ఆధ్వర్యంలో ఉద్దానం తీర ప్రాంత ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కృషి చేయాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు.
ఇదీ చదవండి