శ్రీకాకుళం జిల్లా మందస తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో రేణుకారాణి మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు. సిరిపురానికి చెందిన రైతు రాజేష్ పండా.. మ్యూటేషన్ కోసం మీసేవా ద్వారా దరఖాస్తు చేసారు. వీఆర్వో రేణుకారాణి లంచం డిమాండ్ చేయగా.. అనిశా అధికారులను రైతు ఆశ్రయించారు.
వీఆర్వో గదిలోనే రైతు రాజేష్ పండా లంచం ఇస్తుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన అనిశా అధికారులు.. వీఆర్వోను అరెస్టు చేశారు. విశాఖపట్నం అనిశా కోర్టులో ప్రవేశపెడుతునట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ఇవీ చదవండి: