శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. తమను తహసీల్దార్ అప్పారావు అవమానించారంటూ రోడ్డెక్కారు. సీఎస్పీ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీలర్లు, ఎండీ ఎదుట తాత్కాలిక సేవకులను ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉందని పేర్కొనడాన్ని అవమానంగా భావించిన వాలంటీర్లు రోడ్డెక్కారు. అనంతరం పోలీసులు సర్దిచెప్పిన తీరుకు.. వివాదం సద్దుమణిగింది. ఈ అంశంపై తహసీల్దార్ మాట్లాడుతూ ఇంటింటికీ బియ్యం పంపిణీపై వాలంటీర్లను సహకరించాలని మాత్రమే కోరినట్లు వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి: