శ్రీకాకుళం జిల్లాలో విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు సుడిగాలి పర్యటన చేశారు. శ్రీకాకుళం మహిళా పోలీసు స్టేషన్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌తో పాటు జీఆర్ పురం, సంతబొమ్మాలి, రాజాం పోలీసు స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. వివిధ కేసులకు సంబంధించిన దస్త్రాలను తనిఖీ చేశారు.
శాంతిభద్రతలకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసు సిబ్బందికి సూచించారు. కరోనా నియంత్రణపై ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యం కలిగించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చదవండి