శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా రావివలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ద్విచక్ర వాహనం దగ్ధమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: