శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ సమీపంలో లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన రవికుమార్, చిన్న అనే యువకులు ఆటోపై కాశిబుగ్గ వైపు వస్తుండగా... ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.
ఈ ఘటనలో యువకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: