ETV Bharat / state

ఉదయం నిప్పుల కొలిమి, సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన - వంగర మండలానికి చెందిన మూడు కుటుంబాల్లో పిడుగులు విషాదం

గతేడాది మే 20న శ్రీకాకుళం జిల్లా వంగర మండలానికి చెందిన మూడు కుటుంబాల్లో పిడుగులు విషాదం నింపాయి. శనపతి అచ్యుతరావు (16), సలాపు శ్రీరాములు(61), వడ్డిపల్లి శంకరరావు(43) చనిపోయారు. ఈ ఘోరం జరిగి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి పరిహారం కూడా అందలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఉదయం నిప్పుల కొలిమి, సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వాన

author img

By

Published : May 6, 2021, 1:38 PM IST

* గత ఏప్రిల్‌ 18న జి.సిగడాం మండలం బాతువలో గొర్రెల కాపరులు కె.మహాలక్ష్మునాయుడు, బి.రాము, చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు ఎ.నాగమణి పిడుగుపాటుకు బలయ్యారు. అదే రోజు ఇచ్ఛాపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎ.జయ ఇంటికెళ్లే దారిలో వర్షం వస్తుందని ఓ చెట్టు కిందకు చేరారు. ఎవరికో ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. రెప్పపాటులో ఆమెపై పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఏప్రిల్‌ 24న కవిటి మండలం శవసానపుట్టుగకు చెందిన కె.గౌరమ్మ జీడిపిక్కలు ఏరేందుకు వెళ్లి ఓ చెట్టు కిందకు చేరారు. సరిగ్గా ఆ చెట్టుపైనే పిడుగు పడటంతో మరణించారు.

* మే 3న ఇచ్ఛాపురం మండలం బూర్జపాడులో బి.కాంతారావు, మే 4న టెక్కలి మండలం బొరిగిపేట సమీపంలో గ్రానైట్‌ క్వారీ వద్ద బి.రాజేష్‌కుమార్‌, మందస మండలం వీరగున్నమ్మపురం గ్రామంలో ఎస్‌.గోపయ్య అనే గొర్రెల కాపరిపై పిడుగు పడి మృత్యువాత పడ్డారు. రెండురోజుల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు విడిచారు.

‘అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాంతంలో 30 నుంచి 40 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశముంది. సురక్షిత ప్రదేశానికి వెళ్లండి’ అని మీ చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చిందా...అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమవ్వండి. కొన్ని క్షణాల్లో రాబోతున్న పిడుగులు మిమ్మల్ని, మీతో పాటు అక్కడే ఉన్నవారిని హరించగలదు. మీ కుటుంబాన్ని రోడ్డున పడేయగలదు. జిల్లా వ్యాప్తంగా కొన్నిరోజులుగా మండు వేసవిలో హఠాత్తుగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల భారీ శబ్దాలతో విరుచుకుపడుతున్న పిడుగులకు కర్షకులు, గొర్రెల కాపరులు మృత్యువాత పడుతున్నారు.

వజ్రపుకొత్తూరులో పిడుగుపడి కాలిపోతున్న కొబ్బరి చెట్టు

పరిహారం అంతంతమాత్రమే..

గత నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఎనిమిది మంది పిడుగుపాటుకు మృతిచెందారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఇందులో ఐదుగురు గొర్రెల కాపర్లే. వీరి అకాల మృతితో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతున్న పరిస్థితులు ఉండటం లేదు. విపత్తు నిర్వహణ చట్టం పరిధిలో కేవలం ఆపద్బంధు ద్వారా మాత్రమే రూ.50 వేలు అందుతున్నాయి. దానికి ఎఫ్‌ఐఆర్‌, రేషన్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు స్థానిక తహసీˆల్దార్‌కి సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. అన్నీ సక్రమంగా సమర్పించినా కొన్ని బాధిత కుటుంబాలు ఇప్పటికీ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే బాధిత కుటుంబాలకు సీˆఎం సహాయ నిధి నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందేలా చేయొచ్చు. ఇప్పటివరకూ ఇలా ఆర్థికసాయం పొందిన వారు ఎవరూ లేరు

ఉదయం నిప్పుల కొలిమి, సాయంత్రం వాన..

ఉదయమంతా నిప్పుల కొలిమి, సాయంత్రానికి ఒక్కసారిగా వాన, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు.. ఇటీవల జిల్లాలో వాతావరణ పరిస్థితులివీ. ఈ మార్పులు కారణంగా లాభం మాట అటుంచితే ఆస్తి, ప్రాణ నష్టాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఈదురుగాలులు, పిడుగులు విరుచుకుపడుతున్నాయి. చెట్టూచేమను నిలువునా కుల్చేస్తున్నాయి. ఉద్యాన పంటలు నేలకొరుగుతున్నాయి. వ్యవసాయ పనుల్లో ఉన్నవారు పిడుగుపాటుకు ప్రాణాలు వదిలేస్తున్నారు. గాలుల ధాటికి మామిడి, అరటి, బొప్పాయి, మొక్కజొన్న, జీడి మామిడి వంటి పంటలకు గణనీయంగా నష్టం వాటిల్లుతోంది. ఏప్రిల్‌ 3న 663.47 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మామిడి, అరటి, బొప్పాయి అధిక నష్టం జరిగినట్లు తేల్చారు. వీరఘట్టం, వంగర, రేగిడి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార, కొత్తూరు, భామిని, సీతంపేట, జి.సిగడాం, బూర్జ, రణస్థలం, లావేరు, టెక్కలి డివిజన్‌లోని పలు మండలాల్లోనూ పంటలకు గణనీయంగా నష్టాలు సంభవిస్తున్నాయి.

సురక్షిత ప్రాంతాలే మేలు..

సాధారణ పిడుగులో 30 వేల యాంపియర్లు 30 కోట్ల వోల్టుల విద్యుత్తు ఉంటుంది. మన ఇళ్లల్లో ప్రవహించే విద్యుత్తు 230 వోల్టులు, 5 నుంచి 15 యాంపియర్ల కరెంట్‌తో ఉంటుంది. అంటే పిడుగు పది లక్షల నుంచి కోటి రెట్లు ప్రమాదకరమన్నమాట. అడ్డొచ్చిన దేనినైనా కాల్చి బూడిద చేయగలిగేంత శక్తి దానికి ఉంది. ఆరుబయట ఉన్నవారు వాతావరణ మార్పులు పసిగట్టి సకాలంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం లేదు. పరిస్థితి తీవ్రత తెలిసినా ఏం కాదులే అన్న నిర్లిప్తతే వారిని మృత్యుఒడిలోకి నెడుతోంది. వర్షానికి ముందు వెనుకా పిడుగులు పడే అవకాశముంది. వర్షం కురుస్తున్న ప్రాంతానికి 16 కి.మీ. దూరం వరకూ పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

జాగ్రత్తలే రక్షిస్తాయి

* ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లకు దూరంగా ఉండాలి.
* ఆరుబయట ఉన్నవారే మృత్యువాత పడుతున్నారు. పరిస్థితిని గమనించి వెంటనే సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలి.
* ఇంట్లో ఉంటే కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఊచలు, పిట్టగోడలు, లోహపు నిర్మాణపు భాగాలకు దూరంగా ఉండాలి.
* ఆఖరి ఉరుము వినబడిన అరగంట వరకూ బయటకు రాకూడదు.
* బయట ఉంటే బలంగా ఉన్న నిర్మాణం కిందకు వెళ్లాలి. చెట్ల కింద మాత్రం అస్సలు తలదాచుకోవద్దు. ఒకవేళ ఎక్కువ చెట్ల మధ్య ఉన్నట్లయితే.. గుంపుగా ఎత్తు తక్కువగా ఉండే చెట్ల పంచకు చేరి తలదాచుకోవాలి.
* ఖాళీగా, విశాలంగా ఉన్న మైదానంలో ఉంటే చెవులు మూసుకునేలా మోకాళ్ల మధ్య తల పెట్టుకుని నేలమీద కూర్చోవాలి.
* పిడుగు సాధారణంగా ఎత్తయిన చెట్లు లేదా భవనాలను తాకే అవకాశాలే ఎక్కువ. తక్కువ ఎత్తున్న ప్రదేశాలు కొంత వరకూ సురక్షితం.

హెచ్చరికలు పాటించాలి
వాతావరణానికి సంబంధించి ఇప్పుడు ప్రతి సమాచారం ముందుగానే తెలుస్తోంది. ఆయా హెచ్చరికలను తప్పక పాటించాలి. పిడుగులతో పాటు వర్షం పడే సమయంలో స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రాణం కన్నా ఏదీ విలువైనది కాదు. పనులు కొద్ది సేపు వాయిదా వేసుకునైనా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి ప్రాణం నిలుపుకోవాలి.

- జె.జగన్నాథం, ఏరువాక సమన్వయకర్త, శ్రీకాకుళం

ఇవీ చూడండి : కరోనా కట్టడికి కేరళలో లాక్​డౌన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.