శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లు వేస్తున్నారు. ఈరోజు ఆమదాలవలస మండలంలోని 30 పంచాయతీల అభ్యర్థులు.. 11 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
తోగారంలోని నామపత్రాల కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. వైకాపా అభ్యర్థి భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: