శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసుస్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఫోన్‌లో దుర్భాషలాడుతూ బెదిరించారని... బదిలీపై వెళ్లిన తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు శ్రీకాకుళంలోని నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
ఇవీ చదవండి