కారు నేర్చుకోవాలనే సరదా ప్రాణం పైకి తెచ్చిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం అల్లినగరంలో జరిగింది. గ్రామానికి చెందిన ఒక వక్తి కారు నేర్చుకునేందుకు కొందరు యువకులతో కలిసి జాతీయ రహదారిపైకి వచ్చాడు. ఆ యువకులను రోడ్డుమీదే ఉండమని చెప్పి ఒక్కడే కారు తీసుకు వచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అదుపు తప్పి రహదారి ప్రక్కన ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకోగా.. కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇవీ చదవండి.. చెట్టు నువ్వెక్కుతావా.. మమ్మల్నే ఎక్కమంటావా?