మందేస్తే.. ఎవరిని లెక్క చేయరు. కరోనా దెబ్బకు.. కల్లు కోసం లాక్డౌన్ కూడా పట్టించుకోని పరిస్థితి. కరోనా ప్రభావం తమకు లెక్క లేనట్లుంది కల్లు బాబుల తీరు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో ఓ గీత కార్మికుడు ఈత చెట్టు ఎక్కాడు. ఆయన కిందకు దిగకుండానే కల్లు బాబులు ఎగబడుతున్నారు. ముందు మాకేనంటూ కొందరైతే చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మందు బాబులకు నాలుక పీకేస్తున్నట్లు ఉంది.. ఇలా.. కల్లు కోసం ఆరాటపడుతున్నారు. దీంతో కల్లుకు గిరాకీ ఏర్పడింది. ఉదయమే చెట్టు వద్దు వెళ్లి కల్లు కోసం కాచుకు కూర్చుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల మేరకు కల్లు గీయరాదన్న హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మృత్యుఘోష: ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి