శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. కొంతమంది గ్రామస్థులు.. కౌంటింగ్ కేంద్రం వైపు వచ్చేందుకు ప్రత్నిస్తుండగా పోలీసులు వారిని చెదరగొట్టారు.
అయినప్పటికీ వారిలో మార్పు రాని కారణంగా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. గ్రామస్థులు పరుగులు పెట్టారు. కౌంటింగ్ కేంద్రానికి ఐదు వందల మీటర్ల వరకు ఎవరూ రాకుండా పోలీసులు మోహరింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:
పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. లాఠీఛార్జ్‌తో అదుపు చేసిన పోలీసులు