శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి టెక్కలి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం టెక్కలి సమితికి అధ్యక్షునిగా 1984వరకు పని చేశారు. నెలరోజుల క్రితం ఆయన భార్య సత్తారు అన్నపూర్ణ కరోనాతో మృతి చెందగా... ఆదివారం లోకనాథం కూడా మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజకీయాల్లో చివరి వరకు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడారు. అభివృద్ధి ప్రణాళికలోనూ తనదైన పాత్ర పోషించారు. జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా, టెక్కలి వ్యవసాయ పరపతి సంఘం అద్యక్షునిగా విశేష సేవలు అందించారు.
గోపినాథపురంలో సోమవారం సత్తారు లోకనాథం అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు... లోకనాథం కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. కేంద్ర మాజీ సహాయమంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తదితరులు ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇదీచదవండి.