వైకాపా సర్కారు పరిపాలన సజావుగా సాగడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ఆరోపించారు. శ్రీకాకుళం తెదేపా నేత కూన రవికుమార్ ఇంటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అన్ని వర్గాలకు చెందినవారిపై కేసులు పెట్టి.. బాధలు పెడుతున్నారని ఆరోపించారు. రవికుమార్ కేసు ఆప్రజాస్వామికం అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'వైకాపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం: అచ్చెన్నాయుడు'