రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసినప్పటికీ 93 శాతం నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. దీనిపై కళా తెదేపా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందనడానికి ఎన్నికల వాయిదా నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో తెదేపా శ్రేణులపై జరుగుతోన్న దాడులను ప్రజలు గమనిస్తున్నారని కళా అన్నారు.
ఇదీ చూడండి: