విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన క్షణంలో.. తాము కూడా రాజీనామా చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. అప్పట్లో స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చింది.. ప్లాంట్ విస్తరణకే తప్ప అమ్ముకోవడానికి కాదని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పోరాటానికి నాయకత్వం వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చంద్రబాబు పిలుపునిచ్చారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే హక్కు సీఎంకు మాత్రమే ఉందని తెలిపారు. ప్రైవేటుగా స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఇడుపులపాయలోని భూముల్లో పెట్టండని సలహా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎలాంటి త్యాగాలకైన సిద్ధమేనని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: