అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తెదేపా నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జ్యోతిరావు పూలే పార్క్‌లో నల్ల జెండాలతో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌతు శిరీష , మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడి కిడ్నాప్‌నకు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు