శ్రీకాకుళం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కళావెంకట్రావును ఎంపీ రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే స్పందించని ప్రభుత్వం... ప్రశ్నిస్తున్న తెదేపా నేతలపై కేసులు పెడుతోందని అన్నారు. ఇందుకు కారణం ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డే అని వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకోకుండా... విజయసాయిరెడ్డిపై చెప్పులు విసిరిన ఘటనపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించకుండా గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి: అధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలి: నిమ్మగడ్డ